telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మార్చ్ 31 కల్లా పనులు పూర్తి .. మూడు షిఫ్ట్ లలో పనులు .. కేసీఆర్ ఆదేశం..

kcr on projects construction works

ప్రస్తుతం నీటి ప్రాజెక్టులను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్, పనులపై కాసింత అసంతృప్తి వ్యక్తం చేశారు. వడివడిగా ప్రాజెక్ట్ పనులు జరగాలని, ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా కోటిఎకరాలు సాగుకావాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం రెండోరోజు కూడా పరిశీలించారు. ముఖ్యంగా పంపుహౌ్‌సలు, కాలువల నిర్మాణం.. తదితర నిర్మాణాలు అనుకున్నంత వేగంగా సాగకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా, మార్చి 31లోగా ఈ పనులన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. ఈలోగా మేడిగడ్డ దగ్గర కాఫర్‌ డ్యాం నిర్మించి ఏప్రిల్ నెలలో మోటార్ల వెట్‌రన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. రోజూ రెండు టీఎంసీలు ఎత్తిపోయాలని చెప్పారు. కుదిరితే ఈ వేసవి అవసరాలకు నీటిని లిఫ్ట్‌ చేసేందుకు ప్రయత్నించాలన్నారు.

ఎలాగైనా జూన్‌లో రిజర్వాయర్లు నింపాలని, భారీ మెజారిటీతో గెలిపించిన రైతులు తమ పొలాలకు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం అధికారులు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని పిలుపునిచ్చారు. పనిచేసే కార్మికులను నాలుగు రెట్లు పెంచాలని, మూడు షిఫ్ట్‌ల్లో పని చేయాలని ఆదేశించారు. శ్రీరాంసాగర్‌ పునర్జీవన ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపైనా సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts