telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలుగు రాష్ట్ర ప్రజలకు .. జగన్, కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు..

cm jagan and KCr

ఏపీ సీఎం జగన్‌ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనకు జగన్ సారథ్యం వహించి క్రిస్మస్‌ కేకును కట్‌ చేశారు. ప్రార్థనా గీతాల నడుమ బిషప్‌లు, పాస్టర్ల సందేశాలతో రెండు గంటలకుపైగా కార్యక్రమం కొనసాగింది. రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బిషప్ ప్రార్థనల అనంతరం క్రీస్తు జననం లోకానికి వెలుగునిచ్చిందని గుర్తుగా సీఎం జగన్ క్యాండిల్ వెలిగించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ క్యాండిల్స్ పట్టుకుని ప్రార్థనలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం వంద శాతం సెక్యులర్ రాష్ట్రమని, రాబోయే రోజుల్లో కూడా సెక్యులర్ రాష్ట్రంగానే కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో అన్ని పండగలకు గౌరవం ఉంటుందని, క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ వెల్లడించారు. వారం రోజుల్లో క్రైస్తవ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు కలిపి 75 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే జూన్ నుంచి రైతాంగం పూర్తి లాభం పొందుతుని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, మంత్రులు మహమూద్ ఆలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకిరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, అధికారులు పాల్గొన్నారు.

Related posts