telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎక్సర్‌సైజు కంటే .. ఆ జాగింగ్‌ చాలా మంచి ప్రయోజనాలు ఇస్తుందట…

best time for jogging is evening said scientists

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు .. అయితే నేటి కొరుకులుపరుగుల జీవితంలో ఆరోగ్యం పై శ్రద్ద కాస్త తక్కువనే చెప్పాలి. ఏదైనా పెద్ద సమస్య వస్తే తప్ప ఆరోగ్యం అనేది గుర్తుకు రాదు. కానీ దానిపై కాస్త అవగాహన ఉన్నవారు మాత్రం ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ఎక్సర్‌సైజులు చేస్తుంటారు. జిమ్‌లో రకరకాల బరువులు ఎత్తి తెగ కష్టపడిపోతుంటారు. అయితే వీటన్నిటికంటే జాగింగ్‌ చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్ల జిమ్‌కు వెళ్లలేని వారంతా జాగింగ్‌ చేస్తూ ఫిట్‌నెస్‌ కాపాడుకోవచ్చు. ఎక్కువ మంది ఉదయాన్నే జాగింగ్‌, చేస్తే కొద్దిమంది మాత్రం సాయంత్రం వేళల్లో చేస్తుంటారు.

ఏ సమయంలో జాగింగ్‌ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న దానిపై చాలామందికి సందేహాలున్నాయి. దీనిపై కాలిఫోర్నియా, ఇజ్రాయిల్‌ యూనివర్శిటీల పరిశోధకులు ప్రయోగం చేశారు. చివరికి ఉదయం కంటే సాయంత్రం చేసే జాగింగే మేలని తేల్చారు. దీనికోసం సైంటిస్టులు ఎలుకల మీద ప్రయోగం చేశారు. ట్రెడ్‌మిల్స్‌ మీద వాటిని ఉంచి, రోజులో వేర్వేరు సమయాల్లో.. వేర్వేరు ఎక్సర్‌సైజులు చేయించారు. ఆ తర్వాత వీటి చురుకుదనాన్ని నమోదు చేశారు. ఉదయం జాగింగ్‌ చేసిన వాటికంటే సాయంత్రం జాగింగ్‌ చేసిన ఎలుకలు 50 శాతం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్లు గుర్తించారు.

Related posts