telugu navyamedia
సినిమా వార్తలు

అక్కినేని కోడలిపై కంగనా సోదరి ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha

ఇటీవల కాలంలో బాలీవుడ్ నటీనటులపై సంచలన కామెంట్స్ చేస్తూ… కంగనాపై విమర్శలు చేసే వారందరికీ ఘాటుగా సమాధానం ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కంగనా సోదరి రంగోలి. అయితే తాజాగా రంగోలి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రం “ఓ బేబీ” శుక్రవారం విడుదలైంది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. “ఓ బేబీ” చిత్రానికి వస్తున్న స్పందనను గమనించిన రంగోలి సోషల్ మీడియా వేదికగా సమంతపై ప్రశంసల వర్షం కురిపించింది. “ఓ బేబీ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. సమంత అసలు సిసలైన ఫెమినిస్ట్. ఆమె జీవితంలో కూడా సక్సెస్ సాధించింది. గొప్ప కుటుంబమైన అక్కినేని ఫ్యామిలీకి చెందిన మహిళ. అయినప్పటికీ సమంత తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంది. సమంత లాంటి దేవతల్ని మేము మెచ్చుకుంటాం. కంగనా రనౌత్ తరుపున నీకు ఆల్ ది బెస్ట్” అని రంగోలి ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ పై స్పందించిన సమంత “నా గురించి చక్కగా మాట్లాడినందుకు ధన్యవాదాలు” అంటూ సమంత రిప్లై ఇచ్చింది.

Related posts