telugu navyamedia
సినిమా వార్తలు

కదలిరా జవరాలా . . ! 

ni premalo poetry corner
మేలిముసుగు చిన్నదాన ! 
మెరుపు కళ్ళ కుర్రదాన ! ! 
కోటేరు ముక్కుదాన ! 
కొంటె చూపుల నెరజాన ! ! 

పాపిటిలో బిళ్ళ పెట్టి !
నుదుటిపై బొట్టు పెట్టి ! ! 
చెవులకు జుంకీలు పెట్టి !
చేతులకు కోన పెట్టి ! ! 

బుగ్గల్లో సిగ్గు దోచి ! 
పెదవుల్లో మధువు దాచి ! !
చూపుల తో వల వేసి !
నా మదిలో తిష్ట వేసి ! ! 

బంగారపు వన్నె దాన!
సింగారపు చిన్నె దాన ! !
జాగుఏల ప్రియురాలా !
కదలిరా జవరాలా ! !

ప్రేమయాత్ర చేద్దాం !
నవలోకం చేరుదాం ! ! 
ప్రేమగీతం పాడుదాం !
బ్రతుకంతా కలిసుందాం! ! 

– పల్లోలి శేఖర్ బాబు కొలిమిగుండ్ల

Related posts