telugu navyamedia
సినిమా వార్తలు

డియర్ కామ్రేడ్ : “కథలల్లే…” లిరికల్ సాంగ్

Dear-Comrade

“గీత గోవిందం” తరువాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందన్న జంటగా రూపొందిన చిత్రం “డియ‌ర్ కామ్రేడ్”. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 26న విడుద‌ల చేయ‌నున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నారు. తాజాగా చిత్రం నుండి సెకండ్ సాంగ్ విడుద‌ల చేశారు. “క‌థ‌ల‌ల్లే…” అంటూ సాగే ఈ పాట‌కి రెహ‌మాన్ లిరిక్స్ అందించ‌గా సిద్ శ్రీరామ్‌, ఐశ్వ‌ర్య ర‌విచంద్ర‌న్ గానం అందించారు. రొమాంటిక్‌గా సాగే ఈ పాట సంగీత ప్రియుల‌ని ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ పాటను వీక్షించండి.

Related posts