telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తలైవి : జయలలితగా కంగనా లుక్ పై తీవ్ర విమర్శలు

Thalaivi

కోలీవుడ్ లో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా… అందులో జయలలితకు సంబంధించిన ఒక బయోపిక్ లో బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ప్రధాన పాత్రలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. “త‌లైవీ” అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్‌ ఎంజీ రామ‌చంద్రన్ (ఎంజీఆర్‌) పాత్రలో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్రలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాలో జ‌య‌ల‌లిత‌గా న‌టిస్తోన్న కంగ‌నా ర‌నౌత్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌, టీజ‌ర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. జయలలిత పాత్రలో కంగన లుక్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత అభిమానులు కంగనను ట్రోల్ చేస్తున్నారు. `ఇది `అమ్మ`కు తీవ్ర అవమానం. కంగన చాలా చెత్తగా ఉంది`, `ఆమె జయలలితా? స్మృతి ఇరానీయా?`అంటూ విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.

Related posts