telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ పొట్టి నా కొడుకు అనుష్కని అలా అన్నాడు… పూరి కామెంట్స్

anushka

సినీ పరిశ్రమలో అనుష్క విజయవంతంగా 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించింది ‘నిశ్శబ్దం’ మూవీ టీం. అనుష్కని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసిన పూరీ జగన్నాథ్  ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘ముందుగా ఈ బంగారు తల్లి నాకు ఎలా దొరికిందో చెప్తా.. సూపర్ సినిమా కోసం హీరోయిన్ కోసం ముంబాయి వెళ్లా.. నివాస్ అనే స్నేహితులు ఒక అమ్మాయి ఉంది పంపిస్తున్నా చూడు అని చెప్పాడు. నేను హోటల్‌లో వెయిట్ చేస్తున్నా ఇంతలో వచ్చింది ఒక అమ్మాయి.. చూడగానే ఆకర్షనీయంగా అనిపించింది. మంచి హైట్‌తో చాలా బాగుంది.. ఏం పేరు నీది అంటే స్వీటీ అని చెప్పింది. మీ ఫొటో ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగితే.. ఆధార్ కోసం దాచుకున్న దానిలా ఉన్న ఫొటో తీసి ఇచ్చింది. ఫొటో అంటే ఇది కాదు.. ఫొటో షూట్ చేయలేదా అంటే.. అలాంటిదేం లేదు అంది. యాక్టింగ్ వచ్చా అని అడిగా.. తెలియదు అంది. తెలియదు అంటే.. చేయగలవా? లేవా అని అడిగా ఎప్పుడూ చేయలేదు చేస్తానో లేదో తెలియదు. డాన్స్ అంటే అది కూడా తెలియదు వేస్తే వేయొచ్చు లేదంటే లేదు అంది. ఈ పిల్ల ఏంటి నాకు బంపర్ ఆఫర్స్ ఇస్తుంది అనుకున్నా.. కాని చూడటానికి మాత్రం భలే ఉంది. మా ఆవిడ హోటల్‌లో పై రూంలో ఉంటే.. వెంటనే ఫోన్ చేశా మా ఆవిడ వచ్చి స్వీటీని చూడగానే అబ్బా.. ఇంత అందంగా ఉంది.. సినిమాలో పెట్టేద్దాం అంది. తరువాత నువ్ ఏ చేస్తున్నావ్ స్వీటీ అంటే యోగా టీచర్ అని చెప్పింది. ఆమెను అన్నపూర్ణ స్టుడియోకి తీసుకుని వచ్చాను. అలా స్వీటీ సూపర్ సినిమా కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టింది.

నాగార్జున గారు స్వీటీని చూడగానే.. చాలా బాగుంది అనేశారు. సార్.. ఆడిషన్స్ చేద్దాం అంటే.. ఆడిషన్స్ ఏం వద్దు పెట్టేద్దాం అన్నారు. సార్.. ఆమెను ఏం అడిగినా నాకు తెలియదు తెలియదు అంటుంది.. అందుకే ఎలా చేస్తుందనే టెన్షన్ ఉంది సార్.. సరదాగా ఫొటోలు తీద్దాం అని మేకప్ రవిగాడి దగ్గరకు తీసుకుని వెళ్లా. వాడు అనుష్కని చూడగానే ‘సార్.. పిల్లది బొంబాయా? అని అడిగాడు. అవునురా కొంచెం మేకప్ చెయ్ అన్నా.. వాడు స్వీటీ ముఖాన్ని ఇలా పట్టుకుని.. ఈ ముఖం ఏంటండీ బాబు.. ఎకరన్నర ఉంది. ఇక్కడ్నుండి అక్కడ వరకూ మేకప్ వేయాలా? అని అడిగాడు. వాడు పొట్టినా కొడుకు ఈమె చాలా హైట్ ఉంటుంది. అప్పుడు నేను చెప్పా.. ఆ అమ్మాయిది బెంగుళూరురా.. తెలుగు తెలిసే ఉంటుంది.. నువ్ ఎదవ వాగుడు వాగొద్దు అన్నాను. వాడికి డౌట్ వచ్చి.. అమ్మా నేను ఏం అన్నానో నీకు అర్థమైందా? అని అనుష్కని అడిగాడు. ఈమె సైలెంట్‌గా తల ఊపింది. వాడు కంగారు అయిపోయి.. నేను తెలియక వాగాను.. ఈ విషయం నాగార్జున గారితో చెప్పొద్దు అన్నాడు.

ఆ తరువాత అన్నపూర్ణ స్టుడియోలోనే వినోద్ బాల దగ్గర స్వీటీ యాక్టింగ్ నేర్చుకుంది. డాన్స్ కూడా నేర్చుకుంది. ‘సూపర్’ షూటింగ్ ప్రారంభమైంది. అయితే నాగార్జున గారు.. నీ పేరేంటి అని ఈమెను అడిగారు. స్వీటీ అని చెప్పింది. కాదు ఒరిజినల్ పేరేంటి అని అడగ్గా.. స్వీటీనే అని పాస్ పోర్ట్ చూపించి నాకు ఇదే పేరు అని చెప్పింది. ఇలా కాదు ఈమెకు ఏదైనా పేరు పెడదాం అని చాలా పేర్లు రాసుకున్నాం. ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతాతో కలిసి మా సినిమాలో పాట పాడటం కోసం ఓ అమ్మాయి వచ్చింది.. ఆ అమ్మాయి పేరు అనుష్క. ఆ పేరు నాకు చాలా బాగా నచ్చింది.. సో.. అనుష్కకి ఈ పేరు ఎలా ఉంటుందని అడగ్గా.. బాగానే ఉంటుందా? ఒకసారి నాగ్ సార్‌ని అడుగుదాం అని చెప్పింది. నాగార్జున సార్‌ని అడిగితే.. ఈపేరు ఎవరికీ లేదుగా పెట్టేద్దాం అన్నారు. మొత్తానికి ఆ పేరు చాలా బాగుందని ‘అనుష్క’ నామకరణం అయ్యింది. నిజంగానే ఆమె చాలా మంచిది. ఆమెను చూసి చాలా నేర్చుకోవాలి. రవితేజ, చార్మి, నేను.. అనుష్కని అమ్మా అని పిలుస్తాం. కలిసినప్పుడల్లా కాళ్లకు దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ఎందుకంటే.. ఈమెలో కొన్ని మంచి లక్షణాలైనా మాకు రావాలిరా అని కోరుకుంటాను అన్నాడు. 

Related posts