telugu navyamedia
andhra crime news Telangana

జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబాకు యావజ్జీవ శిక్ష

Journalist Murder case Dera baba Jail

జర్నలిస్ట్‌ రామ్‌చందర్‌ చత్రపతి హత్య కేసులో సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ‌(డేరా బాబా)కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. గతంలో అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు… ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం యావజ్జీవ జైలు శిక్ష విధించింది. అతనితోపాటు ఇతర దోషులు నిర్మల్‌ సింగ్‌, కుల్‌దీప్‌ సింగ్‌, కృష్ణలాల్‌కు కూడా జైలు శిక్ష పడింది.

గుర్మీత్‌ తన ఆశ్రమంలో మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఓ వ్యక్తి రాసిన లేఖను రాష్ట్రంలోని ఒక పత్రిక ప్రచురించడంతో దానికి చెందిన జర్నలిస్టు ఛత్రపతిని గుర్మీత్‌ మనుషులు హత్య చేశారు. బాబా, అతని అనుయాయులు నిర్మల్‌ సింగ్, కుల్దీప్‌ సింగ్, కృష్ణలాల్‌ కలిసి హరియాణాలోని సిర్సా ఆశ్రమంలో 2002లో జర్నలిస్ట్‌ రామ్‌చందర్‌ చత్రపతిని చంపేశారు.

Related posts

గుంటూరు జైలులో రైతులను పరామర్శించిన చంద్రబాబు

vimala p

ఆర్టికల్ 370 రద్దు పై టీడీపీ హర్షం..

vimala p

పాక్ తో ప్రమాదమే అంటున్న.. అమెరికా ..

vimala p