telugu navyamedia
andhra news political

పవన్ నిజమైన రాజకీయ నేత కాదు: మంత్రి అనిల్ కుమార్

minister anil kumar

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కుమార్ మాట్లాడుతూ పవన్ అంటే అభిమానం ఉన్నా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనను వ్యతిరేకించాల్సి వచ్చిందని అన్నారు.

చదువుకునే రోజుల నుంచే తాను మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమానని పేర్కొన్నారు. తొలుత చిరంజీవిని, ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను విపరీతంగా అభిమానించే వాడినని అన్నారు. పవన్ నిజమైన రాజకీయ నేత కాదని అనిల్ యాదవ్ దుయ్యబట్టారు. ధర్నాలు, రాస్తారోకోలతో సమస్యలు తీరవన్న పవన్ ఇప్పుడు అదే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌పై తమకు నమ్మకముందని, పవన్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని తెగేసి చెప్పారు.

చిత్ర పరిశ్రమలో ఉన్నప్పుడు పవన్ చిరంజీవి మా అన్నయ్య అని చెప్పుకునే వారని, కానీ రాజకీయాల్లోకి వచ్చాక మా నాన్న కానిస్టేబుల్ అని చెప్పుకోవడం ఆయనలోని ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అనిపించిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ‌ను విమర్శించే పవన్.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదని అన్నారు.

Related posts

రాజధానిలో .. ధనికుల పిల్లలే లక్ష్యం .. విచారణలో సంచలన విషయాలు ..

vimala p

ఉత్తమ్‌..మీ నెంబర్‌ నేను బ్లాక్‌ చెయ్యగలనా: కేటీఆర్‌

vimala p

ఏపీసీఎం తో.. కేసీఆర్ భేటీ…

vimala p