telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కిడ్నీలో రాళ్లు అని ఆసుపత్రికి వెళ్ళి… ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి

Mom

దక్షిణ డకోటాలో ఉండే డాన్నెట్టె గిల్ట్జ్‌(34) అనే మహిళ గత కొన్నిరోజులుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోంది. కిడ్నీలో రాళ్ల వల్లే ఈ నొప్పి వస్తుందనుకుందామె. నొప్పి తీవ్రత రోజురోజు ఎక్కువ కావడంతో భరించలేక ఈ నెల 10వ తేదీన సమీపంలోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. అది కూడా 34 వారాల గర్భం అని చెప్పారు. ఈ విషయం విన్న గిల్ట్జ్‌కు మొదట సంతోషంతో నోటమాట రాలేదు. గిల్ట్జ్‌ బాధపడుతుంది కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చిన నొప్పితో కాదని ప్రసవ వేదనతో అని గుర్తించారు వైద్యులు. ఆ తరువాత నిమిషాల వ్యవధిలోనే గిల్ట్జ్‌ ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. అది కూడా ఎలాంటి ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలవరీ కావడం విశేషం. పుట్టిన ముగ్గురు బిడ్డల్లో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కాగా, చిన్నారులంతా 1.8కిలోల(4 పౌండ్స్) బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గిల్ట్జ్‌కు పురుడు పోసిన వైద్యులు మాట్లాడుతూ… 34 వారాల గర్భంతో ఉన్నా.. కానీ దాని గురించి ఆమెకు ఏమాత్రం తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. మహిళ గర్భంతో ఉన్న సమయంలో నెలసరి ఆగిపోవడం, బిడ్డ పెరుగుతున్న కొద్ది పొట్ట ముందుకు రావడం జరుగుతుంది. అంతేగాక ఆరు, ఏడో నెల నుంచి కడుపులో బిడ్డ కదలిక తెలుస్తుంది. కానీ గిల్ట్జ్‌ విషయంలో ఇవేవి జరగకపోవడం నిజంగా ఆశ్చర్యమేనని, ఇప్పటికి తాము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఇక డాన్నెట్టె గిల్ట్జ్‌ భర్త ఆస్టిన్ గిల్ట్జ్‌ ఇప్పటి తాను షాక్‌లో ఉన్నట్లు చెప్పాడు. నడుము నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన భార్య ఇలా ముగ్గురు పిల్లలతో బయటకు రావడం తనను ఆశ్చర్యంలో ముంచెత్తిందన్నారు. ఇప్పటికే తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పిన ఆయన… ఇప్పడు పుట్టిన ముగ్గురు బిడ్డలకు బ్లేజ్, గీప్సీ, నిక్కి అని నామాకరణం చేసినట్టు పేర్కొన్నాడు. గిల్ట్జ్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఆసుపత్రి ఖర్చుల కోసం ఆమె స్నేహితులు ఫేస్‌బుక్‌లో నిధులను సేకరించేందుకు ఓ పేజీని క్రియేట్ చేశారు. గిల్ట్జ్‌ ఫ్యామిలీని ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కాగా, ఇప్పటి వరకు 1600 డాలర్ల నిధులు జమా అయినట్లు స్నేహితులు తెలిపారు.

Related posts