telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

స్విస్ బ్యాంకుల్లో 300 కోట్ల భారతీయుల డబ్బు!

swis bank

స్విస్ బ్యాంకుల్లో నిద్రాణంగా ఉన్న ఖాతాలను ఆ దేశ ప్రభుత్వం లెక్కించింది. మొత్తం 2,600 ఖాతాల్లో చాలాకాలంగా ఎటువంటి లావాదేవీలు జరగలేదు. అందులో 12 భారతీయుల ఖాతాలే ఉన్నాయి. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు రూ. 300 కోట్లకు పైగానే ఉంది. 2015 నాటి లెక్కల ప్రకారం వాటిల్లో 4 కోట్ల స్విస్ ఫ్రాంక్స్ డబ్బుంది. ఇప్పుడా మొత్తం మరింతగా పెరిగిపోయి వుంటుంది. 12 మంది భారతీయుల ఆ డబ్బు తీసుకెళ్లి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారు.

ఆ డబ్బును ఏళ్ల క్రితం డిపాజిట్ చేసి, ఇంతవరకూ డ్రా చేయలేదు. స్విస్ నిబంధనల ప్రకారం, 60 సంవత్సరాల పాటు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకుంటే, వారి వారసులు వచ్చి, ఆధారాలు చూపించి, ఆ డబ్బు తీసుకోవచ్చు. లేకుంటే అదంతా స్విస్ ప్రభుత్వ ఖాతాలోకి చేరిపోతుంది. అందుకే స్విస్ ఇప్పుడు ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న ఖాతాల్లోని డబ్బు వివరాలను గురించి తెలుపుతూ, వారి వారసులమేనని ఆధారాలతో వచ్చి డబ్బు తీసుకెళ్లాలని స్విట్జర్లాండ్ కోరింది. ఇక ఈ ఖాతాల్లో రెండేసి చొప్పున కోల్ కతా, ముంబై నగరాలకు చెందిన వారివి, ఒకటి డెహ్రాడూన్ కు చెందిన వ్యక్తిదని తెలుస్తోంది. కొన్ని ఖాతాలు మాజీ సంస్థానాదీశులవని, బ్రిటీషర్ల కాలంలోనే బ్రిటన్, ఫ్రాన్స్ లో స్థిరపడిపోయిన వారి ఖాతాలు కొన్ని ఉన్నాయని సమాచారం.

Related posts