telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ప్రత్యేక హోదా కోసం తెలంగాణ మద్దతు: జగన్

ycp jagan bc declaration meeting
ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని జగన్ కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడని టీడీపీ తో పాటు జనసేన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌ఎస్ తో కలిస్తే తప్పేంటి? అని జగన్ ప్రశ్నించారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా జగన్  టీఆర్‌ఎస్ ను వెంటబెట్టుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేందుకు తాను తెలంగాణ అధికార పార్టీతో కలిసి ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. 
ఈ  సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదన్నారు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలలో వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనమే కీలకం అవుతామన్నారు. ఎపీ లోని మొత్తం 25 ఎంపీ స్థానాల్లో వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనమే కీలకమవుతామని చెప్పారు. మొత్తం ఎంపీ స్థానాల్లో వైసీపీనీ గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తెలంగాణలోని 17 ఎంపీ సీట్ల మద్దతు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.

Related posts