telugu navyamedia
సినిమా వార్తలు

“బ్యాక్ టూ స్కూల్” అంటున్న రామ్ చరణ్…!?

Ram-Charana

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌ళ్లీ స్కూలుకెళ్లాడు. ఈ వయసులో చరణ్ మళ్ళీ స్కూలుకి వెళ్ల‌డం ఏంటి? అనే సందేహం రావ‌చ్చు. సాధార‌ణంగా ఎవ‌రైనా చిన్న‌త‌నంలో చేసిన అల్ల‌రి, ఆట‌ల‌ను అంత త్వ‌ర‌గా మ‌రచిపోలేరు. దీనికి తానేమీ అతీతుడిని కాను అని అంటున్నారు రామ్‌చ‌ర‌ణ్‌. చరణ్ తన బాల్యంలో త‌మిళ‌నాడులోని లారెన్స్ స్కూల్‌లో చ‌దువుకున్నారు. ఆ స్కూల్‌ని రామ్‌చ‌ర‌ణ్ ఇటీవల సంద‌ర్శించారు. అక్క‌డ డార్మెట‌రీ, క్యాంటీన్‌, త‌ర‌గ‌తి గ‌దులను ప‌రిశీలించి త‌న జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు. అలాగే అక్క‌డి విద్యార్థుల‌తో ఫోటో దిగారు. లారెన్స్ స్కూల్‌ను రామ్‌చ‌ర‌ణ్ సంద‌ర్శించిన ఫోటోల‌ను ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు భారీగా లైకులు, షేర్లు లభిస్తున్నాయి.

Related posts