telugu navyamedia
news political

భారత్ పై మరోసారి ఇమ్రాన్ తీవ్ర వ్యాఖ్యలు

imran pakistan pm

భారత్ పై మరోసారి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ అక్కసు వెళ్లగక్కారు. జమ్మూ కశ్మీర్ ను భారత్ తన అనుబంధ భూభాగంగా చూపించే ప్రయత్నం చేయడం తొలి తప్పు అయితే, ఇప్పుడు అక్కడి ప్రజలకు స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం మరో తప్పు అని ఇమ్రాన్ ఆరోపించారు. 25 వేల మందికి తాజాగా డొమిసైల్ సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా భారత్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ జనాభా స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమం అని తమకు చెందాల్సిన భూభాగంలో భారత్ పెత్తనం ఏంటని ఇమ్రాన్ అక్కసు వెళ్లగక్కారు.

ఇది ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను, నాల్గవ జెనీవా ఒడంబడిక సహా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని విమర్శించారు. దీనిపై తాము ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ ను సంప్రదించామని తెలిపారు. అంగీకార యోగ్యం కాని ఈ చర్యను భారత్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భారత్ చర్యలతో దక్షిణాసియాలో శాంతి, భద్రతలు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయని ట్వీట్ చేశారు

Related posts

ఫ్లిప్ కార్ట్ & అమెజాన్.. భారీ ఆఫర్లు… త్వరపడాలి…

vimala p

చత్తీస్‌గఢ్‌ : .. భారీ వర్షాలు .. వరదలతో అల్లాడుతున్న ప్రజలు..

vimala p

షోయ‌బ్ అక్త‌ర్ వ్యాఖ్య‌ల‌ను తప్పుబట్టిన గ‌వాస్క‌ర్

vimala p