telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి

TRS Leader Gutha Critics Uttam

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌ స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేసినందున ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ వద్దకు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు విపక్ష సభ్యులు తీసుకెళ్లారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ చైర్మెన్ గా పనిచేశారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని గులాబీ బాస్ కేసీఆర్ మండలి చైర్మన్‌గా ఎంపికచేశారు.

Related posts