telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిబంధనలను ఉల్లంఘిస్తే తన మనవడిపై చర్యలు తీసుకోవచ్చు: హోంమంత్రి

Mahmood ali,Congress,Bjp

నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే తన మనవడి పై పై చర్యలు తీసుకోవచ్చని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. పోలీస్ ఉన్నతాధికారి వాహనంపై కూర్చొని టిక్ టాక్ వీడియో చేసిన తన మనవడిని మహమూద్ అలీ తీవ్రంగా మందలించారు. తన మనవడు ఫర్కాన్ అహ్మద్ నిబంధనలను ఉల్లంఘిస్తే అతనిపై చర్యలు తీసుకోవచ్చని అన్నారు.

జీపుపై ఉన్న తన స్నేహితుడిని గౌరవించకపోతే..అతని పీక కోస్తా అనే డైలాగ్స్ తో హోంమంత్రి మనవడు ఫర్కాన్ అహ్మద్ చేసిన టిక్ టాక్ వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ వీడియో పై నెటిజన్లు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ తన మనవడిని మందలించారు.

Related posts