telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పాలలో తమలపాకులు కలుపుకుని తింటే…100 రోగాలు మటాష్ !

తమలపాకులు అంటే తెలియని వారుండరు. ఇవి ఎక్కువగా పాన్‌లలో వాడుతారు. అయితే.. ఈ తమలపాకుల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆకలి అనిపించనప్పుడు.. నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆకలివేయకపోతే రెండు తమలపాకులు నమిలితే చాలని వైద్యులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరంగా ఉంటే.. రెండు తమలపాకులు తీసుకుని చేతిలో నలిపి వాటిని పాలలో కలుపుకుని తాగితే బ్లోటింగ్‌ సమస్య చిటికలో తగ్గిపోతుంది. ఇలా చేస్తే.. వెంటనే ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు. తలనొప్పికి కానీ మైగ్రైన్‌కి కానీ తమలపాకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. తరచూ తలనొప్పి వేధిస్తుంటే.. నుదిటి మీద తమలపాకులను రాయడం కానీ… లేకపోతే..తమలపాకుల రసంతో కాసేపు మసాజ్‌ చేస్తే తలనొప్పి తగ్గుతుంది. ప్రతిరోజూ తమలపాకులు తీసుకుంటూ ఉంటే మెంటల్‌గా హెల్త్‌ బాగుంటుంది. డిప్రెషన్‌ కూడా తగ్గును. జీర్ణక్రియలో అరుగుదలకు సహకరించే యాసిడ్స్‌ ఉత్పత్తి చేయడానికి తమలపాకు సహకరిస్తుంది. ఎప్పుడైనా చిన్న గాయాలు కానీ వాపు, నొప్పి కలిగితే తమలపాకులను నొప్పి ఉన్న చోట ఉంచాలి. వీటి రసంతో మసాజ్‌ చేస్తే నొప్పుటు మటాష్‌ అవుతాయి. అలాగే తమలపాకుల వల్ల దగ్గు, జలుబు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.

Related posts