telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: గవర్నర్ నరసింహన్

Republic Day Celebrations Hyderabad
ప్రజాసంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. విద్యుత్‌ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని పేర్కొన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయ సత్ఫలితాలిచ్చిందని గవర్నర్ తెలిపారు. కళ్యాణలక్ష్మి పథకం దేశానికి ఆదర్శమని  చెప్పుకొచ్చారు.
గత నాలుగున్నరేళ్లలో నీటిపారుదల రంగానికి రూ.77 వేల 777 కోట్లు ఖర్చు చేశామన్నారు. అలాగే రాబోయే కాలంలో రూ.లక్షా 17 వేల కోట్ల విలువైన పనులు చేస్తామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకమన్నారు. నిర్దేశించుకున్న సమయానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మార్చి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లా నీరు సరఫరా చేస్తామని గవర్నర్ పేర్కొన్నారు.

Related posts