telugu navyamedia
news political Telangana

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో గోరటి వెంకన్న!

goreti venkanna

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఒకదానిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాగాయకుడు గోరటి వెంకన్నతో భర్తీ చేయాలని టీఆర్ఎస్ అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

వెంకన్న తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి తొలి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన వెంకన్నను శాసనమండలికి పంపిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఒకటి, రెండు సమావేశాల్లోనూ వెంకన్న గతంలో పాల్గొన్నారు.

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానికి కర్నె ప్రభాకర్ పేరు పక్కా అయినట్టు ప్రచారం జరుగుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే రెండో దాంట్లో తిరిగి నాయినినే కూర్చోబెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇక మూడో స్థానం కోసం మాజీ ఎంపీ సీతారాంనాయక్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తుండగా, అనూహ్యంగా గోరటి వెంకన్న పేరు కూడా తెరపైకి వచ్చింది.

Related posts

ఎలాగైనా వలసలు ఆపేదిశగా .. ట్రంప్, వీసాల దరఖాస్తు ఫీజు పెంపు..

vimala p

సీఎం అయినా విచారణకు హాజరు కావాల్సిందే… జగన్ కు షాకిచ్చిన కోర్ట్

vimala p

నేడే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ.. బరిలో ఉండే గుర్రాలు ఎవరో.. !

vimala p