telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

గ్యాస్ తో నడిచే .. ఇస్త్రీ పెట్టె.. ధర అదుర్స్.. లాభం బోలెడు..

gas iron box environment friendly

గ్యాస్ తో ఇస్త్రీ చేసుకునే విధంగా ఇస్త్రీ పెట్టెలు వాడుకలోకి వచ్చాయి. ఈ ఇస్త్రీ పెట్టెలకు గ్యాస్ పైప్ తగిలిస్తే చాలు ఇస్త్రీ పెట్టె హీట్ అవుతుంది. ఫలితంగా ఇస్త్రీ చెయ్యొచ్చు. ఒక సిలిండర్ తో దాదాపు 500 దుస్తులు ఇస్త్రీ చెయ్యొచ్చు. దీని ఖరీదు కేవలం రూ. 8000 మాత్రమే. ధర ఎక్కువే అనిపించవచ్చు. రోజు కనీసం బొగ్గుకోసం సగటున వంద రూపాయలు ఖర్చు చేయాలి. ఆదాయం 500 వస్తుంది. అంటే అన్ని పోను కూలి కింద రోజుకు రూ. 200 వరకు మిగులుతాయి. ఈ ఆదాయంతో బతకడం అంటే చాలా కష్టం. అదే గ్యాస్ తో నడిచే ఇస్త్రీ పెట్టెను ఒకసారి కొనుగోలు చేస్తే.. గ్యాస్ తో నడుస్తుంది. రోజుకు 500 బట్టలు ఈజీగా ఇస్త్రీ చెయ్యొచ్చు. కష్టం తక్కువ.. ధర కూడా తక్కువే.

గ్యాస్ తో రోజు మొత్తంలో 500 బట్టలు ఇస్త్రీ చేస్తే.. కనీసం 4వేల రూపాయల వరకు సంపాదన వస్తుంది. గ్యాస్ సిలిండర్ ఇతర ఖర్చులు కలిపి వేయి రూపాయలు వేసుకున్నా కనీసం మూడు వేల రూపాయలు మిగులుతుంది. అంటే నెలకు కనీసం 70 నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. పైగా బొగ్గుల పెట్టేలా బరువు ఎక్కువగా ఉండదు. చేతులు కాళ్ళు కాల్చుకుని ఇబ్బంది కూడా ఉండదు. ఈజీగా చేసుకోవచ్చు. మన్నిక ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పొల్యూషన్ నుంచి కూడా బయటపడొచ్చు. అన్ని రకాలుగా ఈ ఇస్త్రీపెట్టె ఉపయోగకరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Related posts