telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

వరండాలో అనకొండ… కళ్లెదుటే ఉన్నా రెండ్రోజులు పట్టుకోలేకపోయారు…!!

Anakonda'

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ కుటుంబానికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఇంటి వరండాలో కుటుంబమంతా కలిసి కూర్చోవడానికి వారు సోఫా ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పట్లాగే ఆరోజు కూడా అక్కడ కూర్చోవడానికి వచ్చిన ఆ ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే సోఫా పక్కనే ఓ కొండచిలువ చుట్టలు చుట్టుకొని ఉంది. దాన్ని చూసి భయపడిపోయిన ఆమె.. వెంటనే పాములు పట్టుకొనే వారికి సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న వారు ఆ గది ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోలో పామెక్కడుందో కనిపెట్టండంటూ నెటిజన్లకు ఓ సవాల్ విసిరారు. దాదాపు రెండు రోజులు కష్టపడితేగానీ ఆ ఫొటోలో పాము ఎక్కడ ఉందీ కనుక్కోలేకపోయారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts