telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో లంచాలు ఉండవు.. ప్రతి పారిశ్రామికవేత్తకు హామీ: వైఎస్ జగన్

ఏపీలో లంచాలు ఉండవని ప్రతి పారిశ్రామికవేత్తకు హామీ ఇస్తున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ఈరోజు జగన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం వల్ల ఏపీకి పరిశ్రమలు రావంటూ అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. అలాంటి అపోహలను నమ్మొద్దని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలపై రకరకాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పరిశ్రమలు ఏర్పాటు చేసేటప్పుడే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకముంటేనే, పరిశ్రమలకు స్థానికులు సహకరిస్తారని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సెంటర్ల ద్వారా పరిశ్రమల్లో ఉద్యోగులకు ఉండాల్సిన నైపుణ్యం కోసం శిక్షణనుఅందజేస్తామని అన్నారు. 

Related posts