telugu navyamedia
andhra news political

రాజధాని నిర్మాణానికి నిధులను ఆపేశారు: కోడెల

AP Assembly sessions January 30 Speaker Kodela

ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులను ఆపేశారని టీడీపీ నేత,  అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆరోపించారు. గుంటూరుజిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కోడెల మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ నుంచి ప్రజలు చాలా ఆశించారనీ, కానీ వారంతా ఇప్పుడు నిరాశ చెందారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా చెప్పినట్లు జగన్ ఏపీకి ప్రత్యేకహోదా సాధించలేకపోయారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విత్తనాల పంపిణీపై సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను కూడా నిలిపివేశారన్నారు.ప్రజావేదికను కూల్చేసి ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ కు చంద్రబాబు ఇంటిపై ఉన్న శ్రద్ద ప్రజా సమస్యలపై లేదన్నారు. నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

Related posts

మేనిఫెస్టోలో ఏం చెప్పానో అదే చేస్తున్నా.. అసెంబ్లీలో సీఎం జగన్

vimala p

సదరన్ రైల్వే భారీసంఖ్యలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

vimala p

ఏపీ లో పోలీసులకు వారాంతపు సెలవలు.. నేటి నుండే అమలు..

vimala p