telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతుల పొలాలను అంబానీ, అదానీలకు అప్పగించడానికే కొత్త చట్టాలు

erraballi dayaaker

బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. బిజెపి దేశాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తున్నదని… సిగ్గులేకుండా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని… అలాంటి వాళ్ళను నిలదీయాలని పేర్కొన్నారు. మనం, మన పార్టీ, మన నేత ఏమి తప్పులు చేయలేదని… మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదని తెలిపారు. పైగా ప్రజలకు బోలెడు చేశామని… బాగా బడాయిలకు పోతున్న బీజేపీ… ప్రజలకు చేసింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. కోచ్ ఫ్యాక్టరీ ని అడిగితే.. ఉత్తర ప్రదేశ్ లో పెట్టి 1200 ఎకరాల స్థలం ఇస్తే, రూ.300 కోట్ల విలువ చేయని డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ ఇస్తారట అని మండిపడ్డారు. కొత్త చట్టాలతో ఏడాదికి ప్రతి రైతు మీద లక్ష రూపాయల భారం పడనున్నదని… రైతుల పొలాలను అంబానీ, అదానీలకు అప్పగించే కుట్ర చేస్తున్నదని ఫైర్‌ అయ్యారు. గిరిజన యూనివర్సిటీ అటే పోయిందని.. ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదన్నారు.

Related posts