telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పెరిగిన ఎల్‌పీజీ సిలెండరు ధర!

cooking gas price hiked by govt

దేశంలో కొన్ని నెలల పాటు వరుసగా తగ్గుతూ వచ్చిన ఎల్‌పీజీ సిలెండరు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై ఈ రోజు మెట్రో నగరాల్లో రూ.37 వరకు ధర పెరిగింది. నేటి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.11.50 పెరిగినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) పేర్కొంది. కోల్‌కతాలో రూ.31.50, ముంబైలో రూ.11.50, చెన్నైలో రూ.37 పెరిగింది.

14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో నిన్నటి వరకు రూ.581.50 ఉండగా, ఇప్పుడు రూ.593కి చేరింది. కోల్‌కతాలో నిన్నటి వరకు రూ.584.50కి ఉండగా, ఇప్పుడు 616కి పెరిగింది. ముంబైలో నిన్నటి వరకు 579 రూపాయలు ఉండగా, 590.50కి చేరింది. అలాగే, చెన్నైలో నిన్నటి వరకు రూ.569.50 ఉండగా, ఇప్పుడు 606.50కి చేరింది. లాక్ డౌన్ నేపథ్యంలో వంటగ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts