బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్ పెళ్ళి తరువాత కూడా సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ “83”లో నటిస్తుండగా, ఇటీవలే ఈ అమ్మడు టీంతో కలిసింది. రణ్‌వీర్ తన భార్యకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాడు. ఈ చిత్రంలో దీపిక “రోమి దేవ్” అనే పాత్రలో కనిపించనుంది. 83 చిత్రంలో క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నాడు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. 2020 ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే రోజు కపిల్ దేవ్ బయోపిక్ చిత్రంని విడుదల చేయనున్నారు. మధు మంతెన, విష్ణు ఇందూరి, ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్, సకీబ్ సలీమ్, చిరాగ్ పటిల్, అదినాథ్ కొఠారే, ధైర్య కర్వా, దినకర్ శర్మ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్‌లో జరుగుతున్నట్టు తెలుస్తుంది.
తాజాగా రణ్‌వీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీపిక తో పాటు చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్‌తో దిగిన పలు ఫోటోలు షేర్ చేశాడు. అలానే దీపికా పదుకొనె తన భర్త అయిన రణ్‌వీర్ సింగ్ ని బ్యాటుతో బాదుతుంటే, గాల్లోకి ఎగురుతున్నట్టు ఫన్నీ రియాక్షన్ ఇచ్చిన వీడియో ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.”స్టోరీ అఫ్ మై లైఫ్, రియల్ అండ్ రీల్ ” అనే ట్యాగ్ కూడా పోస్ట్ చేశారు. రణ్‌వీర్ పోస్ట్ చేసిన వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
జెమినీ గణేషన్ కు జమున వార్నింగ్… సంచలన వ్యాఖ్యలు