telugu navyamedia
andhra news political

ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు రద్దు..సీఎం జగన్‌ కీలక నిర్ణయం

jagan

ఏపీ సీఎం జగన్ బాక్సైట్‌ తవ్వకాల పై కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ.. టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ బాక్సైట్‌ తవ్వకాల పై నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తవ్వకాలు జరపడం సరికాదన్నారు.

బాక్సైట్‌ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇక నుంచి ఏజెన్సీలో మైనింగ్‌ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నెలకోసారి తప్పనిసరి పర్యటించాలని సీఎం ఆదేశించారు.

Related posts

నాట్స్..నూతన సంవత్సర శుభాకాంక్షలు..

vimala p

డబ్బుకోసం బైలింగ్వెల్‌ సినిమా చేయలేదు .. : నాని

vimala p

భార్య, కుమార్తెలను చంపి.. రైలుకింద పడి భర్త ఆత్మహత్య

vimala p