రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు జగన్ జన్మదినోత్సవం జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి, 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. ’30 కాకపోతే 300 పెట్టు.. ఇంకా కావాలంటే 3000 పెట్టు… నీది నాది ఏమి పోతుంది ప్రజలే కదా నష్ట పోయేది’ అని కేశినేని నాని విమర్శలు గుప్పించారు.
కమల్ అనుచిత వ్యాఖ్యల పై కేసు నమోదు