telugu navyamedia
andhra news telugu cinema news

సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం శుభవార్త…

cm jagan

చిత్ర పరిశ్రమతో పాటు అనుబంధ వ్యవస్థలకు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు విద్యుత్ స్థిర ఛార్జీల చెల్లింపును రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తదుపరి 6 నెలల కాలానికి చెందిన విద్యుత్ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లు, మల్టిప్లెక్సులు జులై 2020 నుంచి డిసెంబర్ 2020 నెలల్లో చెల్లించాల్సిన స్థిర ఛార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం . బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీ ప్లెక్సు థియేటర్లకు లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం… కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న చిత్ర పరిశ్రమ, అనుబంధ కార్యకలాపాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్దికలిగేలా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు పేర్కొంది ప్రభుత్వం.

Related posts

జాతీయ పార్టీలకు .. లోక్ సభ ఎన్నికలలో పాల్గొనే హక్కు తీసేస్తున్న కేంద్రం..!

vimala p

తప్పు ఒప్పుకున్న పైన్…

Vasishta Reddy

మహానాయకుడు  విడుదల..  బాలయ్య విలవిల 

ashok