telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్ళి ఫోటోను షేర్ చేసిన అనుపమ్ ఖేర్…!

Anupam-Kher

బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ అనుపమ్ ఖేర్ అందులో దూల్హానియా లేజాయింగే, తేబాజ్, డాడీ అనే సినిమాలున్నాయి. ఆయన ఇప్పుడు కుచ్ బీ సక్తా హై అనే టాక్‌షో నిర్వహిస్తున్నారు. కాగా అనుపమ్ ఖేర్ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో చండీఘడ్ ఎంపీగా ఉన్నారు. తాజాగా ఆయన తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటోను పంచుకున్నాడు. అది అతని వివాహం సందర్భంగా తీసినది. అనుపమ్ ఖేర్, కిరణ్ ఖేర్‌ల వివాహం జరిగి నేటికి 34 సంవత్సరాలు. ఈ ఫోటోలో అనుపమ్ ఖేర్ తల్లిదండ్రులు పుష్కరీనాథ్, దుల్హరీ ఖేర్, సోదరుడు రాజు ఉన్నారు. వీరు 1985లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే. ఈ సందర్భంగా అతను తన జీవిత భాగస్వామి కిరణ్ ఖేర్ గురించి మాట్లాడుతూ… “ముప్పై నాలుగేళ్లుగా తనతో గడపడం చాలా సంతోషంగా ఉంది. నా జీవితానికి సార్థకత చేకూర్చింది నా భార్య. తన విలువైన సమయాన్ని తనకు పంచినందుకు ధన్యుడనని ఆయన అన్నారు. అనుపమ్‌తో పెళ్లికి ముందే కిరణ్‌కు గౌతమ్ బెర్రీ అనే బిజినెస్‌మ్యాన్ తో పెళ్లయింది. వారికి బాబు కూడా ఉన్నాడు. అనుపమ్‌తో పరిచయం అనంతరం గౌతమ్‌కు విడాకులిచ్చి వారిరువురు పెళ్లితో ఒక్కటయ్యారు.

Related posts