telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఎయిర్‌పోర్ట్‌ నుండి బయలుదేరిన చంద్రబాబు…

ఈరోజు మధ్యాహ్నం నుండి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి గురించే చర్చ. అయితే ఎట్టకేలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయన ధర్నా ముగించారు. ఈ ఉదయం ఆయన పర్యటన కోసం రేణిగుంట వచ్చారు. అయితే అనుమతి లేదంటూ ఆయనను అడ్డుకోవడంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని అన్నారు. అందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వెంటనే పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు.. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. 9 గంటల పాటు అక్కడే బైఠాయించారు. చివరికి ఎన్నికల అక్రమాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు చంద్రబాబు తిరుగు పయనం అయ్యారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం.. చిత్తూరు ఎస్పీ సెంధిల్ కూమార్ చంద్రబాబును ఒప్పించే ప్రయత్నాలు చేయగా అవి ఫలించి ఆయన బయలు దేరారు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది అనేది.  

Related posts