telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాభిప్రాయానికి జన్మభూమి గొప్ప వేదిక: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

ప్రజాభిప్రాయానికి జన్మభూమి గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జన్మభూమి గ్రామసభల్లో ప్రజా స్పందన బాగుందని, ఇదే స్ఫూర్తి ఇకపై కూడా కొనసాగించాలని తెలిపారు. శుక్రవారం జన్మభూమి-మాఊరుపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడతూ పరిపాలనలో పారదర్శకత, నూతన ఆవిష్కరణలకు జన్మభూమి కేంద్రమని పేర్కొన్నారు.

జన్మభూమి కార్యక్రమంలో అభివృద్ధి ప్రణాళికలను ఖరారు చేస్తున్నామని, నిర్దిష్టమైన కార్యాచరణ చేపడుతున్నామని చెప్పారు. ప్రజాసేవకు జన్మభూమి అద్భుత అవకాశమని అన్నారు. జన్మభూమిలో 98% ఆనందంగా పనిచేస్తున్నామని టెలికాన్ఫరెన్స్‌లో అధికారులు చెప్పారు. ప్రజల్లో మమేకమయ్యే అవకాశాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు అంది పుచ్చుకోవాలని సూచించారు. సులభతర వాణిజ్యంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌లో నిలిచిందని లీక్వాన్ యూ స్కూల్ సర్వే వెల్లడించిందని చంద్రబాబు తెలిపారు.

Related posts