telugu navyamedia
andhra political

అసెంబ్లీ లో ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు

protest in ap for special status by apcm
ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేశంతో ఊగిపోయారు. తమ రక్తం పొంగుతోందని..ఊడిగం చేసేవాళ్లమా తాము అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఏ జాతీయ ప్రాజెక్ట్ పనులైనా పోలవరం అంత వేగంగా జరుగుతున్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తిచేశామన్నారు. దేశంలో ఏ ప్రాజెక్ట్ పనులైనా ఈ స్థాయిలో జరుగుతున్నాయని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉద్వేగానికి గురయ్యారు. 
పోలవరం, పట్టిసీమలపై వైసీపీ కోర్టులకు వెళుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటుందని విమర్శించారు.సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక్క లీడర్ లేరని, ఉన్న ఒక్క వెంకయ్యనాయుడిని కేబినెట్ నుంచి పంపేశారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల తిరిగే వెంకయ్యను ప్రభుత్వం నుంచి పక్కన పెట్టారన్నారు. దక్షిణ భారత నేతలకు ఏం గౌరవం ఇచ్చారో బీజేపీ చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.

Related posts

పుంజుకున్న ప్రత్యర్ధుల బలం..ఆ మంత్రుల గెలుపు కష్టమే!

vimala p

ఆప్ ఎమ్మెల్యే నివాసంలో .. ఐటీ సోదాలు.. 2.5 కోట్ల నగదు స్వాధీనం.. !

vimala p

విశాఖ లోక్ సభ… ముందంజలో సినీ నిర్మాత 

ashok