కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రభావం వల్ల దేశంలోని పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. వలస కార్మికులు, మహిళలు, పేదలకు మేలు చేసేలా రూ.1.70 లక్షల కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. పేద, బలహీన తరగతి ప్రజలు ఇబ్బందులపు పాలుకాకుండా ఉండేందుకు గరీబ్ కల్యాణ్ పేరుతో కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది.పేదలు, రోజువారీ కూలీల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సరైన నిర్ణయమని ఆయన అన్నారు. సరైన దిశలో తీసుకున్న తొలి అడుగని ప్రశంసలు కురిపించారు. లాక్ డౌన్ ను భరిస్తున్న రైతు కూలీలు, మహిళలు, వృద్ధులకు దేశం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
గతంలో తాను కూడా రెండు సార్లు పార్టీ మారాను: జగ్గారెడ్డి