పరిపాలనలో నిజాయతీ అనే సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. వైద్య చికిత్స నిమిత్తం ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. భారత్‌ను మోసం చేసి, ప్రపంచంలో ఎక్కడా దాక్కోలేరని స్పష్టం చేశారు. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో నిందితుడైన కార్పొరేట్ లాబీయిస్టు రాజీవ్ సక్సేనా, కార్పొరేట్ ఏవియేషన్ లాబీయిస్టు దీపక్ తల్వార్‌ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
‘యూపీఏ బాగోతాలన్నీ బయటపడుతున్నాయి. రక్షణ శాఖ ఒప్పందాలన్నింటిలో మధ్యవర్తి ప్రమేయం ఎందుకు? భారత్‌ను మోసం చేసి ప్రపంచంలో ఎక్కడ దాగినా తప్పించుకోలేరు. ఇలాంటి వారిని వెనక్కి రప్పించే దౌత్య సంబంధాలు భారత్‌కు ఉన్నాయి. భారత్‌ను మోసం చేసిన వారు తప్పించుకోలేరు’ అని జైట్లీ వరస ట్వీట్లలో పేర్కొన్నారు.
అక్రమ కేసులతో కేసీఆర్ భయపెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి