telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజధాని మార్పును .. సహించబోము .. : చంద్రబాబు

chandrababu

ఏపీ రాజధాని అమరావతిని పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం అత్యావశ్యకం అని ఆయన అన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా నిర్మించిన అమరావతిని జగన్ అడ్రస్ లేకుండా చేస్తున్నారంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి అంటూ ఆయన ఆరోపించారు. ఒకవేళ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కొనసాగిస్తే లక్ష కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వచ్చేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాజధాని మార్పు విషయంలో జగన్ కమిటీలు ఎందుకు వేస్తున్నారు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధి జరుపుతున్న సింగపూర్ లాంటి దేశాలను అన్ని పెట్టుబడులను ఉపసంహరించుకునేల చేస్తే రాష్ట్రంలో పెట్టుబడులు ఇంకెవరు పెడతారూ అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ఇసుక కొరత అలాగే ఉందని ఆరోపించిన చంద్రబాబు.. ఇసుక కొరత సమస్యను పరిష్కరించకుండా ఇసుక వారోత్సవాలు నిర్వహించినంత మాత్రాన ఫలితం ఉండదు అని వ్యాఖ్యానించారు చంద్రబాబు.

Related posts