telugu navyamedia
crime culture news trending

8 లక్షలు పెట్టి రూమ్ బుక్ చేసుకున్న జంట… అక్కడ చూస్తే అసలు హోటలే లేదు…!

Room

బ్రిటన్‌కు చెందిన ఓ జంటకు షాకింగ్ అనుభవం ఎదురైంది. సెలవులు సరదాగా గడపడానికి స్పెయిన్ వెళ్లాలనుకన్న ఆ జంట.. ఎయిర్‌బీఎన్‌బీ అనే ప్రముఖ సైట్లో మంచి రివ్యూలు ఉండటం చూసి, స్పెయిన్‌లోని ఇబిజాలో ఓ వీఐపీ పెంట్ హౌస్ బుక్ చేసుకుంది. తమ పెంపుడు కుక్కలను కూడా తెచ్చుకోవచ్చని ఉండటంతో, 10వేల యూరోలు(దాదాపు రూ.8లక్షలు) పెట్టి వారు ఆ పెంట్‌హౌస్ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత తమగదిలో దిగడానికి హోటల్‌కు వెళ్లగా, ఆ ప్రాంతంలో అసలు వీఐపీ పెంట్‌హౌస్ సేవలు ఎక్కడాలేవని హోటల్ రిసెప్షనిస్టు చెప్పింది. దీంతో ఖంగుతిన్న ఇయాన్, డెనిస్ ఫెల్థామ్ జంట.. కుక్కపిల్లలను కూడా ఉండనిచ్చే హోటల్ కోసం వెదికి, అక్కడకు 40మైళ్ల దూరంలోని మరో హోటల్‌లో దిగింది. తెల్లారగానే ఎయిర్‌బీఎన్‌బీ సంస్థకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. బుక్ చేసుకున్న హోటల్లో రూమ్ ఇవ్వడం కుదరదని చెప్తేనే వారికి రీఫండ్ వస్తుందని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. దాంతో మళ్లీ 40మైళ్లు ప్రయాణించి ఆ పెంట్ హౌస్ హోటల్‌కు వెళ్లి, అక్కడ వీఐపీ సేవలు లేవని రిసెప్షనిస్టుతో ఎయిర్‌బీఎన్‌బీకి చెప్పించారు. అయితే ఈ సమస్యకు తమ వద్ద సమాధానం లేదన్న ఎయిర్‌బీఎన్‌బీ తామేమీ చేయలేమని తొలుత చేతులెత్తేసింది. ఈ విషయమై ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ సమస్యను తాము పరిష్కరించామని, ఆ పెంట్‌హౌస్ యాడ్ ఫేక్ అని ఎయిర్‌బీఎన్‌బీ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం.

Related posts

హీరో నాగార్జున పొలంలో మృతదేహాం…!?

vimala p

వాజ్‌పేయీ అందరికీ ఆదర్శంగా నిలిచారు: రాష్ట్రపతి

vimala p

శ్రీలంకకు .. చైనా భారీ నజరానా.. భారత్ పై గురి..

vimala p