telugu navyamedia
news telugu cinema news

బతుకు గోస…

bratuku gosa poetry corner
చుక్క చినుకులేక
పుడమితల్లి ఎండిపోయె
వసుధతల్లి కంటతడిచూసి
కంటి నీరు ఇంకిపోయె
ఋణమిచ్చిన ఆసామి 
ఉన్న గూడు తీసుకుపోయె
నిలువనీడలేక చెట్టుకొమ్మల చాటులో
కరుణలేక భానుడు కాల్చివేస్తే
మాడేమంటల జ్వాలలో
బతుకు భారాన్ని మోయలేక
ఓ దేవుడా
ఈ దీనుడి మోర ఆలకింపుమా
అప్పుచ్చిన అయ్యకు 
రుసుము జమచేసే వరకు
నా కట్టెను కడతెరనీకూ
మా చితికిన బ్రతుకులకు 
మోసం చేయుటరాక
రుణం తీర్చిన పిమ్మట
తనువు చాలించుకుంటాను
ఓ వరుణదేవా మాపై కరుణ చూపుమా
bratuku gosa poetry corner-ఎస్.చిన్నికృష్ణ, చిత్తూరు.

Related posts

విజ‌యవాడ నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా: వ‌ర్మ‌

vimala p

నా కవిత…

vimala p

కారులో ఉన్నది రాజ్ తరుణ్… కానీ కారు… !

vimala p