telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మే 1 నుండి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు…

students masks exams

కరోనా కారణంగా ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు, ఆన్‌లైన్ క్లాసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని అసెంబ్లీలో ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అయితే, మరి పరీక్షల సంగతి ఎంటి? అనే చర్చ మొదలైంది.. దీనిపై క్లారిటీ ఇచ్చింది ఇంటర్ బోర్డు.. ఇంటర్ పరీక్షలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని.. మే 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని.. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్.. వార్షిక పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన ఆయన.. రెండు, మూడు రోజుల్లో హాల్ టికెట్స్ పంపిస్తామన్నారు.. అయితే, ఎన్విరాన్ మెంటల్, ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు మాత్రం నిర్వహించడం లేదని.. అసైన్‌మెంట్ రూపంలో ఇస్తున్నామని.. వారం, 10 రోజుల్లో సమాధాలు రాసి విద్యార్థులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇక, ఏప్రిల్ 7 నుండి ప్రాక్టికల్స్ ఉంటాయన్న ఇంటర్ బోర్డు సెక్రటరీ.

Related posts