telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పాక్ లో మరోసారి ఉగ్ర పంజా.. పోలీసులతో సహా 9 మంది మృతి

bomb blasts in srikakulam district costs 7 lives

పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. డేరాఇస్మాయిల్‌ఖాన్ జిల్లాలో బాంబు ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఆస్పత్రి బయట ప్రజలు రద్దీగా ఉన్న ప్రమాదంలో బాంబులు పేలడంతో ఆరుగురు పోలీసులతో సహా 9 మంది మృతి చెందారు. ఉగ్రదాడిలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బాంబులు పేలడంతో ఆసుపత్రి ప్రాంతం దద్దరిల్లింది. దాడులు తమ పనేనని తెహ్రక్ – తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఒప్పుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టారు. మరో వైపు దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో తనిఖీలు ముమ్మరం చేశారు.

Related posts