telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అభ్యర్థుల బీజేపీ తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ…

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పశ్చిమ బెంగాల్ లో పార్టీల విమర్శల దాడి పెరుగుతుంది. అయితే ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నుండి బీజేపీకి పెద్ద ఎత్తున వలసలు వెళ్తున్నాయి. చాలా మంది తృణమూల్ ముఖ్య నేతలే ఆ పార్టీని వదిలి బీజేపీలో చేరడంతో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే ఇక్కడ నిన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తే.. ఇవాళ బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది.. తొలి జాబితాలో 57 మంది పేర్లను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ.. ఇక, పశ్చిమ బెంగాల్‌లో విజయం కోసం ఆ పార్టీ సర్వ శక్తులు ఒడ్డుతోంది.. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారి.. నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగనున్నారు.. ఆయన సీఎం మమతా బెనర్జీని ఎదుర్కోబోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బెంగాల్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి.. టీఎంసీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి దినేష్ త్రివేది.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ రేపు కోల్‌కతాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నారు. చూడాలి మరి ఈసారి ఎన్నికలో ఏం జరుగుతుంది… ప్రజలు ఏం తీర్పు ఇస్తారు అనేది.

Related posts