telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ నిర్ణయాల వల్లే విద్యార్థుల భవిష్యత్ నాశనం: బీజేపీ నేత లక్ష్మణ్

లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం కావడానికి సీఏం కేసీఆర్ అసంబద్ధ నిర్ణయాలే కారణమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్మండిపడ్డారు.తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన గందరగోళం పై ఆనయన ఘాటుగా స్పందించారు. అనేకమంది విద్యార్థుల బలవన్మరణానికి కారణం కావడం పట్ల ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ మార్కుల విషయంలో కేసీఆర్ సకాలంలో సమీక్ష నిర్వహించి ఉంటే కొన్ని ప్రాణాలైనా నిలిచేవని అభిప్రాయపడ్డారు.

23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డ తర్వాత తీరిగ్గా సమీక్షలు జరిపి, ఫ్రీ రీవాల్యూయేషన్, ఫ్రీ వెరిఫికేషన్ అని చెప్పడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని విమర్శించారు. ఇంటర్ బోర్డు వ్యవహారం పై విద్యాశాఖ మంత్రి నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలని దుయ్యబట్టారు. లేదంటే ముఖ్యమంత్రే ఆయన్ను బర్తరఫ్ చేయాలిని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తాము విద్యార్థుల క్షేమం కోసం రాజకీయాలు చేస్తున్నామని, మీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూలేరని కేసీఆర్ ను హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఏప్రిల్ 28న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని ఆయన తెలిపారు.

Related posts