telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

విజ్ఞప్తి చేసినా వినని భక్తులు.. ఖైరతాబాద్ కమిటీ ఇబ్బందులు

khairatabad ganesh

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాధుడి దర్శనానికి భక్తులు రావద్దని కమిటీ విజ్ఞప్తి చేసినప్పటికీ తొలిరోజునే పెద్దఎత్తున ప్రజలు స్వామి దర్శనానికి వచ్చారు. ఒక్కరంటే ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించాలన్న ఆలోచన లేకుండా, సెల్ఫీలకు ఎగబడ్డారు. పలువురు కనీసం మాస్క్ లు కూడా ధరించక పోవడం గమనార్హం. వీరిని నియంత్రించలేక ఉత్సవ కమిటీ ఇబ్బందులు పడింది.

ఆన్ లైన్ లోనే పూజలు, దర్శనం చేసుకోవాలని గణేశ్ ఉత్సవ కమిటీ ఎంతగా విజ్ఞప్తి చేసినా భక్తులు వినలేదు. ప్రతియేటా పెట్టే 60 అగుడుల భారీ విగ్రహం స్థానంలో, ఈ సంవత్సరం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ భక్తులు నిబంధనలు పక్కనబెట్టి గణనాధుడి దర్శనం కోసం బారులు తీరారు.

Related posts