telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ బీజేపీ సిద్దాంతం: కన్నా

Kanna laxminarayana

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ బీజేపీ సిధ్ధాంతమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. వెంగళాయపాలెంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రాంభించారు. అనంతరం కన్నా మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం బీజేపీ అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు.

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చింతపల్లి యేసయ్యకు బీజేపీ తొలి సభ్యత్వం ఇచ్చిందన్నారు. 8980808080 నంబర్‌కి మిస్డ్ కాల్ చేయడం ద్వారా సులువుగా బీజేపీ సభ్యత్వం పొందవచ్చన్నారు.కాంగ్రెస్ పార్టీ గరీభీ హఠావో అని చెప్పుకుంది తప్ప ఎప్పుడూ పాటించలేదన్నారు. అతి పెద్ద రాజకీయ సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ బీజేపీనేనని కన్నా చెప్పుకొచ్చారు.

Related posts