అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని స్థానికులు సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోజరిగింది. భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్ అనే యువకుడు ఆ మహిళకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ఆ యువకుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు.
ఆ క్లిప్‌ను చూసిన ఆ మహిళ బంధువులు అతడిపై ఆగ్రహంతో ఉన్నారు. తమ వర్గానికి చెందిన మహిళతో అతడు సన్నిహితంగా ఉంటున్నాడని ఆ మహిళ బంధువులు ఈ రోజు ఉదయం ఆ యువకుడిని ఇంటిలో నుంచి బయటకు లాక్కొచ్చి, చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి నిరసనకు దిగారు. పోలీసు వాహనాలను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ కు దెయ్యం పట్టింది: పంచుమర్తి అనురాధ