telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ లేకున్నా టీంఇండియా రాణిస్తుంది : అక్షర్

టీమిండియా ఏ ఒక్కరిపైనో ఆధారపడదన్నాడు భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్. ‘విరాట్‌ కోహ్లీ ఒక్కడిపైనే ఒత్తిడి ఉండదు. జట్టులో సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా కుర్రాళ్లు ఫామ్‌లో ఉన్నారు. కోహ్లీ లేకుండానే మన జట్టు ఆసీస్‌పై టెస్టు సిరీస్‌ నెగ్గింది. ఇంగ్లండ్‌ సిరీసులో అతను త్వరగా ఔటైనా రిషభ్ పంత్‌, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. రోహిత్‌ సెంచరీలు బాదేశాడు. స్పిన్నర్లు సైతం లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశారు’ అని అక్షర్‌ పటేల్‌ చెప్పుకొచ్చా. ‘ఆస్ట్రేలియాలో శార్దూల్‌ ఠాకూర్‌, సుందర్‌ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇంగ్లండ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు 400-500 వంటి భారీ స్కోర్లు చేదించాల్సిన అవసరం రాదు. స్కోర్లు 300 లేదా 250 వరకే ఉంటాయి. అందుకే లోయర్‌ ఆర్డర్‌ భాగస్వామ్యాలు చాలా అవసరం. పుజారా, కోహ్లీ, రోహిత్‌, రహానే, పంత్‌ టాప్‌ ఆర్డర్‌లో ఉన్నారు. ఆ ఐదుగురిలో ఏ ఇద్దరు త్వరగా ఔటైనా మిగతా వాళ్లు పని పూర్తి చేయగలరు. భారత జట్టుకు ఆ సత్తా ఉంది. ఏ ఒక్కరి మీదో ఆధారపడదు. ఓపెనర్లు కాకుండా మిడిలార్డర్‌ లేదంటే లోయర్‌ ఆర్డర్‌ ఫలితాలను రాబట్టగలరు’ అని అక్షర్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్ పయనం కానుంది.

Related posts