telugu navyamedia
ఆరోగ్యం సామాజిక

ప్రయాణం చేస్తుంటే వాంతులు అవుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

women abused for being good

కొందరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ ప్రయాణించాలంటే చాలా భయం వేస్తూ ఉంటుంది. వాహానాల్లో ప్రయాణిస్తే కొందరికి వాంతులు అవుతుంటాయి. దీంతో ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

పుదీనా పుదీనాకు కూడా వాంతులను ఆపే గుణం ఉంటుంది. ప్రయాణంలో మీతో పాటు పుదీనా ఆకులను ఉంచుకోండి. వాటిని నములుతూ ఉండండి. అలాగే పుదీనా టీ తాగండి. ఇలా చేస్తే దాదాపు కడుపులో వికారం కంట్రోల్ అవుతుంది

అల్లం రసం మీరు ప్రయాణం చేసే ముందు కాస్త అల్లం రసం తాగండి. అలాగే మధ్యమధ్యలో అల్లం టీ కూడా తాగుతూ ఉండండి. దాని వల్ల మీకు వాంతులు రాకుండా ఉంటాయి.

నిమ్మ ఒక నిమ్మకాయను తీసుకోండి. దాన్ని తొక్క తీసి బ్యాగులో పెట్టుకోండి. జర్నీ స్టార్ట్ అయిన వెంటనే దాన్ని రసం పీల్చుతూ ఉండండి. కొద్దికొద్దిగా నిమ్మరసాన్ని టేస్ట్ చేస్తూ ఉంటే కడుపులో వికారం అనేది ఉండదు. వాంతులు రావు. ఇది చాలా మందికి వర్కవుట్ అవుతుంది.

కిటీకీల్లోంచి చూడకండి కొందరికి కిటీకీల్లోంచి బయటకు చూస్తూ ఆ వేగానికి కళ్లు తిరిగినట్లు అవుతుంది. దాంతో వాంతులు వస్తాయి. అందువల్ల బయటకు చూడకుండా కూర్చొండి. ఇలా చేస్తే కొద్ది వరకు కడుపులో వికారాన్ని తగ్గించుకోవొచ్చు.

ఎక్కువగా తినొద్దు అలాగే జర్నీ చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. అలా చేస్తే వాంటింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల లిమిట్ లో తినండి. దగ్గర ప్రాంతాలకు జర్నీలు చేసేటప్పుడు ఈ ట్రిక్ పాటించండి.





Related posts