telugu navyamedia
వార్తలు సామాజిక

మనసున్న ప్రైవేటు హాస్పిటల్.. కరోనా రోగికి కోటిన్నర బిల్లు మాఫీ!

dubai hospital

ప్రైవేటు హాస్పిటల్స్‌ లో చేరిన రోగుల రక్తం పిండి లక్షల యాజమాన్యాలు బిల్లులు వసూలు చేస్తాయి. కానీ అక్కడక్కడ కొన్ని మనసున్న హాస్పిటల్స్‌ కూడా ఉన్నాయి. ఈ విషయంలో దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రి ఓ కరోనా రోగిని ఆడుకొంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన ఓడ్నాల రాజేశ్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. 42 ఏళ్ల రాజేశ్‌ రోనా వైరస్‌ బారిన పడి, దుబాయ్‌లోని రషీద్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. 80 రోజుల పాటు రాజేశ్‌కు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. దీంతో

వైరస్ బారి నుంచి రాజేశ్‌ చక్కగా కోలుకున్నాడు. కాకపోతే బిల్లు మాత్రం తడిసిమోపడయ్యింది. సుమారు ఏడు లక్షల 62 వేల దిరమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యం బిల్లు వేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే కోటిన్నర బిల్లు చూడగానే రాజేశ్‌కు గుండె గుబిల్లుమంది. తన దీనగాధను గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితికి వివరించాడు. వెంటనే సమితి సభ్యులు ఇండియన్‌ కాన్సలేట్‌ లేబర్‌ అధికారి హర్జీత్‌ సింగ్‌ను సంప్రదించారు.. రాజేశ్‌ స్థితిగతులను ఆయనకు వివరించారు.. రూపాయి కూడా కట్టలేని నిస్సాహయస్థితిలో ఉన్నాడని చెప్పారు. హర్జీత్ సింగ్‌ బిల్లు మాఫీ చేయాలంటూ ఆసుపత్రి యాజమాన్యానికి ఓ లేఖ రాశారు. ఆసుపత్రి కూడా సహృదయతో బిల్లును మాఫీ చేసింది.

Related posts