telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒంటరిగా అనిపిస్తోందా… వర్మ చిట్కా పాటించండి

RGV

మనలో కొంతమంది తాము ఒంటరి వాళ్లమని, తమ వెనుక అండగా ఎవరూ లేరని బాధపడుతుంటారు. అలాంటి వారికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సలహా ఇచ్చాడు. అదేంటంటే..అదేమిటంటే ”మీకెప్పుడైనా ఒంటరిగా అనిపించి… నా వెనుక ఎవరూ లేరనే ఫీలింగ్ కలిగితే… వెంటనే హారర్ సినిమా చూడండి. మీ ఒంటరి తనం మాయమైపోతుంది… మీ వెనుక ఎవరో ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది” అంటూ ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్గా ఉండే వర్మ ఇప్పుడు ఇచ్చిన సలహా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం నుంచి “వెన్నుపోటు” పాటను విడుదల చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

Related posts